నూతన సంవత్సరం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు దేవాలయాలు రద్దీగా మారాయి. స్వామివార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయినవిల్లి సిద్ధి వినాయకుడు, అప్పనపల్లి బాలాజీ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రజలంతా సుఖంగా ఉండాలని అర్చకులు అభిషేకాలు నిర్వహించి.....తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలు, యానంలోనూ ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.. మహిళలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు.. యానాంలో వివిధ కార్యాలయాల సిబ్బంది డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనాను సత్కరించి... నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు... ముమ్మడివరంలో తెదేపా మహిళా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, ఆర్టీవో శీనా నాయక్, డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు రాజకీయ నాయకులు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ( ఎస్టీయూ) 2021 నూతన డైరీని పీఓ ప్రవీణ్ ఆదిత్య, క్యాలెండర్ను డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్ ఎల్. వేణుగోపాల్, ప్రతినిధులు నాగభూషణం, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి. 2021 వచ్చేసింది... కోటి ఆశలతో సుస్వాగతం