రహదారిపై గుంతలు పూడ్చి వినియోగంలోకి తీసుకొచ్చే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గుంతలుపడిన ప్రాంతాన్ని ఇసుక, కంకరతో చదును చేసి అనంతరం దానిపై సంచుల్లో సిద్ధంగా ఉన్న ఇన్ స్టామిక్స్-పీఆర్ వేసి మరమ్మతు పూర్తి చేస్తున్నారు. ఈ బాధ్యతను సురేఖ సంస్థకు అప్పగించారు. అడ్వాన్స్ డ్ ఇన్ స్టామిక్స్ టెక్నాలజీతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా పనులు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి... హోంమంత్రి సొంత మండలంలోనే ఇలా ఉంటే ఏలా..?