స్వదేశీ యాప్‌ల ప్రోత్సాహంలో భాగంగా కాకినాడకు చెందిన వ్యక్తి రూపొందించిన యాప్‌కు రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి వంశీ జూమ్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన లిబిరో యాప్‌నకు ఈ బహుమతి వచ్చింది. సోల్ఫేజ్ ఐటీ సొల్యూషన్ కంపెనీ సీటీవోతో పాటు మరో రెండు కంపెనీలకు కన్సెల్టెంట్‌గా వంశీ వ్యవహరిస్తున్నారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఏర్పాటు చేసిన ఛాలెంజ్‌కు గత ఏప్రిల్‌లో 2 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. వంశీ రూపొందించిన లిబిరో యాప్ 5వ స్థానం కైవసం చేసుకుంది. జూమ్ యాప్‌తో పోలిస్తే లిబిరో యాప్ మెరుగైనదని వంశీ చెప్పారు.
ఇదీ చదవండి: