మట్టి, ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తూ గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను గుల్ల చేస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు, బండారు సత్యానందరావు నిరసన వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, మండపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న నారాయణలంక గ్రామంలో రైతులు, గ్రామస్థులు మట్టి, ఇసుక తవ్వకాలు, రవాణాకు వ్యతిరేకంగా వంట - వార్పు నిర్వహించారు. వారికి సంఘీభావంగా తెదేపా నేతలు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నారాయణ లంకలో రైతులు భూములతో పాటు వంతెన రక్షణకు చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
viveka murder case: వివేకా హత్యకేసు.. పులివెందుల కోర్టుకు సునీల్..!