ETV Bharat / state

Nara Lokesh Brahmani Mulakat with Chandrababu: చంద్రబాబుతో లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్.. కీలక విషయాలపై చర్చ - చంద్రబాబుతో నారా లోకేశ్ బ్రాహ్మణి ములాఖత్

Nara Lokesh Brahmani Mulakat with Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రాహ్మణి.. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి ములాఖత్ అయ్యారు. చంద్రబాబుతో పలు కీలక విషయాలను చర్చించారు. ములాఖత్ అనంతరం పార్టీ ముఖ్యనేతలతో లోకేశ్ చర్చించారు.

Nara Lokesh Brahmani Mulakat with Chandrababu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 3:35 PM IST

Nara Lokesh Brahmani Mulakat with Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు లోకేశ్, బ్రాహ్మణి రాజమహేంద్రవరం జైలులో కలిశారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ ఎం.వి సత్యనారాయరాజు చంద్రబాబుతో మూలాఖత్ అయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి లోకేశ్, బ్రాహ్మణి జైల్లోకి వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, న్యాయపరమైన అంశాలతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​తో సమన్వయ కమిటీ సమావేశం, నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర గురించి చర్చించినట్లు సమాచారం. ములాఖత్ ముగిసిన తర్వాత లోకేశ్, బ్రాహ్మణి టీడీపీ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లారు.

చంద్రబాబుతో జరిగిన సమావేశంలో.. జనసేనతో జరిగే తొలి సమన్వయ కమిటీ సమావేశంలో తెలుగుదేశం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబుతో చర్చించారు. రేపటి నుంచి నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నందున ఆమె పర్యటనల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చంద్రబాబు చర్చించారు.

TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!

జనసేనతో జరిగే భేటీలో ఏయే అంశాలను చర్చిస్తున్నామనే విషయాన్ని లోకేశ్ చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలపై చర్చించారు. నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. క్షేత్ర స్థాయి వరకు తెలుగుదేశం-జనసేన కమిటీల ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది.

దసరా సందర్భంగా రాసిన లేఖ అంశాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందనే విషయాన్ని లోకేశ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ భేటీ అయ్యారు. జనసేనతో సమన్వయ కమిటీ సమావేశానికి ముందు ముఖ్య నేతలతో లోకేశ్ సంప్రదింపులు జరిపారు.

Chandrababu letter to Telugu people : నేను జైలులో లేను.. ప్రజల హృద‌యాల్లో ఉన్నా: చంద్రబాబు

Nara Lokesh Fires on CM Jagan: సైకో జ‌గ‌న్ చూపు ప‌డితే ప‌చ్చని పంట పొలాలు ఎండిపోతాయని, అడుగుపెడితే నిండుగా ఉన్న డ్యాముల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అయిపోతాయని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. క‌రువుకి బ్రాండ్ అంబాసిడ‌ర్, ద‌రిద్రానికి కేరాఫ్ అడ్రస్ జ‌గ‌న్ అని దుయ్యబట్టారు. వందేళ్ల చ‌రిత్రలో అతి త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదై రాష్ట్రంలో క‌రవు విల‌య‌తాండ‌వం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సాగునీరు మ‌హాప్రభో అని రైతులు గ‌గ్గోలు పెడుతుంటే, తాడేప‌ల్లి కొంప‌లో నీరో చ‌క్రవ‌ర్తిలాగా ఇసుక‌-లిక్కర్ లెక్కలు వేసుకుంటూ, రాజ‌కీయ క‌క్ష సాధింపుల్లో మునిగితేలుతున్నాడని ఆక్షేపించారు.

ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి వ‌రి వేసిన రైతుకి ఉరి, పంట‌లు వేసిన అన్నదాత‌ల‌కి మిగిలింది గుండెమంట‌లన్నారు. కృష్ణా ప‌శ్చిమ డెల్టాలో ఎండిన పంట చూసి ఆందోళ‌న‌తో పొలం దగ్గరే ఉరి వేసుకుంటామంటోన్న రైతుల గోడు విన‌ప‌డ‌దా అని నిలదీశారు. క‌ర్నూలు జిల్లా ఉరుకుంద వ‌ద్ద సాగునీటి కోసం అధికారుల కాళ్లపై ప‌డిన రైతులు ఆవేదన ప‌ట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా గార మండ‌లంలో వ‌ర్షాభావ ప‌రిస్థితులు, తెగుళ్లతో ఎండిన వ‌రి పంట‌కి నిప్పు పెట్టిన రైతన్నల ఆగ్రహ జ్వాల‌లు క‌న‌ప‌డ‌వా తాడేపల్లి నీరో చ‌క్రవ‌ర్తికి అని మండిపడ్డారు.

TDP Leader Nara Lokesh Emotional Speech: "ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాం".. టీడీపీ నేతల ముందు లోకేశ్ కంటతడి

Anna Canteen Completed 500 Days: టీడీపీ హ‌యాంలో ఆక‌లి తీర్చిన అన్నా క్యాంటీన్లను జ‌గ‌నాసురుడనే పెత్తందారుడు మూసేసి పేద‌ల ఉసురు పోసుకున్నాడని లోకేశ్ ధ్వజమెత్తారు. నిరుపేదల కోసం తన సొంత నిధుల‌తో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఆరంభించానని లోకేశ్ తెలిపారు. జ‌గ‌న్ సైన్యం చాలా అడ్డంకులు సృష్టించారని ఆక్షేపించారు. మ‌న‌ సంక‌ల్పం ముందు సైకోలు ఓడిపోయారన్నారు. నేటితో మంగ‌ళ‌గిరి అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తి చేసుకుందని, ఏడాదిన్నర కాలంలో ల‌క్షలాది మంది ఆక‌లి తీర్చిన అన్నా క్యాంటీన్ నిర్వహ‌ణ‌కి విరాళాలు ఇచ్చిన దాత‌లు, బాధ్యత‌లు చూస్తోన్న వాలంటీర్లు, స‌హ‌క‌రిస్తున్న టీడీపీ నేత‌లు, కార్యక‌ర్తలు, ప్రజ‌ల‌కు లోకేశ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

ACB Court on Chandrababu Security: జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. స్పందించిన ఏసీబీ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.