తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పురపాలక సంఘం నూతన చైర్పర్సన్ ఎంపిక ప్రశాంతంగా జరిగింది. చైర్‌పర్సన్‌గా రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్‌గా టిక్కి రెడ్డి వెంకటేశ్ నియమితులయ్యారు. వీరితో పాటు నూతన పాలకవర్గ సభ్యుల చేత జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి లక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, అమలాపురం మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. పట్టణంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: గుంటూరు నగర మేయర్‌గా కావటి మనోహర్ నాయుడు