ప్రధాన మంత్రి మోదీకి రాసిన లేఖను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ విడుదల చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాల్లో ఆశలు ఆవిరి అవుతున్న వేళ.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. పెట్రోలు, గ్యాస్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయనీ.. వాటిని నియంత్రించాలని ముద్రగడ కోరారు. కరోనా తరువాత వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఓటు హక్కు వినియోగంపై.. ఆకట్టుకుంటున్న లఘుచిత్రం