ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగ పోరాట సమితి బహిరంగ లేఖ రాసింది. సుప్రీం కోర్టు ఆగస్టు 27వ తేదిన ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీలకు జరుగుతున్న అన్యాయలపై అసెంబ్లీలో చర్చించాలని మాదిగ పోరాట సమితి డిమాండ్ చేసింది. అంతేగాక ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కేటాయించాలని కోరింది.
తిరుపతి ఎంపీ స్థానాన్ని వైకాపా... ఎస్సీలకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై మోసం చేసిందని మాదిగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న అన్నారు. వచ్చే ఏడాది అన్ని రాష్ట్రాలతో కలిపి దిల్లీలో మహా ధర్నా చేపడతామని ఆయన తెలిపారు. వచ్చే మార్చి నెలలో విజయవాడలోనూ 2లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
'అయినవిల్లి తెదేపా అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి కేటాయించాలి'