ETV Bharat / state

రఘురామ స్వచ్చందంగా పార్టీ నుంచి తొలగిపోయినట్లే: ఎంపీ భరత్​ - ఎంపీ మార్గాని భరత్ రామ్ తాజావార్తలు

రఘురామ వైకాపాలో ఉంటూ..పార్టీ నాయకులను, నేతలను ధూషిస్తున్నారంటే స్వచ్చందంగా పార్టీ నుంచి తొలగిపోయినట్లే అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్​సభ స్పీకర్​ని కోరిన అంశంపై ఆయన మాట్లాడారు.

Raghu rama
Raghu rama
author img

By

Published : Jun 29, 2021, 10:25 PM IST

వైకాపాలో ఉంటూ... పార్టీ మీద నమ్మకం లేకుండా, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం సరి కాదని ఎంపీ రఘురామపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. రాజ్యాంగంలోని షెడ్యూల్​ పది ప్రకారం అతనిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈ విషయాన్ని ఆయన గమనించాలన్నారు.

ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టో పార్టీ నిర్ణయించిందో... అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతీ అభివృద్ధి కార్యక్రమాన్ని రఘురామ వ్యతిరేకించటం సరికాదన్నారు. రఘురామ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి లేకపోవటంతో స్వచ్చందంగా ఆయన తన సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని భరత్​ పేర్కొన్నారు. ఈ అంశాన్ని​ లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ఇదీ చదవండి: Alla Nani: జగన్​పై ద్వేషంతోనే చంద్రబాబు దీక్ష: మంత్రి ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.