Modi praises bandi sanjay: దిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తొలి రోజే తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బండి సంజయ్‌ను చూస్తే వెంకయ్య నాయుడు గుర్తొస్తారని... అద్భుతంగా మాట్లాడతారని... పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు జల్లు కురిపించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రజా సంగ్రామ యాత్రపై సంజయ్ నివేదిక సమర్పించారు.
Modi appreciates bandi Sanjay : ఈ సందర్భంగా యాత్ర ఏవిధంగా కొనసాగిందో చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సంజయ్‌కు సూచించారు. సంజయ్ కొద్దిసేపు హిందీలో మాట్లాడిన తర్వాత తాను పూర్తిస్థాయిలో చెప్పలేకపోతున్నానని తెలిపారు. స్పందించిన ప్రధానమంత్రి భావోద్వేగాలతో కూడిన అంశాన్ని మాతృ భాషలోనే చెప్పగలమంటూ.. తెలుగులో మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని సంజయ్ చెప్పారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలు, యాత్ర సాగిన తీరును వివరించడంతో కార్యవర్గ సభ్యులంతా కరతాళధ్వనులు చేశారు.అనంతరం మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి సంజయ్ ఎంతగానో పాటుపడుతున్నారని కితాబిచ్చారు. ఎంతో గొప్పగా యాత్ర చేసిన సంజయ్ తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేరని, యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జి హిందీలో వివరించాలని కోరారు.
దాంతో సంజయ్ తెలుగులో మాట్లాడిన అంశాన్ని తరుణ్‌ఛుగ్ హిందీలో అనువదించడంతో పాటు యాత్రలో చోటు చేసుకున్న వివిధ ఘట్టాలను వివరించారు. అనంతరం మరోసారి ప్రధానమంత్రి మాట్లాడుతూ బండి సంజయ్ యాత్ర చేపట్టిన మార్గాల్లోకి ఇతర రాష్ట్రాల నేతలు వెళ్లి యాత్ర సాగిన తీరుపై అధ్యయనం చేయాలని సూచించారు.
భవిష్యత్తులో సంజయ్ చేపట్టే యాత్రకు ఇతర రాష్ట్రాల నుంచి యువ మోర్చా నేతలను పంపిస్తే మార్గదర్శకంగా ఉంటుందంటూ సంజయ్‌ను భుజం తట్టి అభినందించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తన ప్రసంగంలో ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించడంతో పాటు సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇవీ చదవండి: