ప్రజా వ్యతిరేక చర్యలపై తాము పోరాడుతుంటే ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐఐ.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ వద్ద ఏర్పాటుచేసిన యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: