ETV Bharat / state

రాజధాని రైతులకు రాజమహేంద్రవరం తెదేపా నేతల మద్దతు - కారులో అమరావతికి బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్ల

అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో తెదేపా నేతలు అమరావతికి బయలుదేరారు. రాజధానిని రక్షించాలంటూ నినాదాలు చేశారు.

mla gorantla butchaiah chowdary amarvathi car tour
కారులో అమరావతికి బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్ల
author img

By

Published : Feb 10, 2020, 12:03 PM IST

కారులో అమరావతికి బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్ల

అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెదేపా నేతలు రాజమహేంద్రవరం నుంచి అమరావతి బయలుదేరారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 55 రోజులుగా రైతులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణచివేసి, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బుచ్చయ్య విమర్శించారు. సుమారు 50 కార్లలో అమరావతికి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

ఇదీ చదవండి: ఉద్యోగులపై సీఎం పంజా విసురుతున్నారు: చినరాజప్ప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.