కొత్తపేట వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇసుక సరఫరాలో ఏపీఎండీసీ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎస్ఈబీ అదనపు ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తపేట వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. కోనసీమలో ఇసుక ఉన్నా ...ఇంటి నిర్మాణానికి దొరకడం లేదని.. నిబంధనల ప్రకారం ఇసుక ఇవ్వడం లేదని జగ్గిరెడ్డి మండిపడ్డారు. కోనసీమలో 10 ఇసుక ర్యాంపులున్నా ఒక్కదాన్నీ ప్రారంభించలేదన్నారు. తాను లేఖ ఇచ్చినా రెండు ట్రక్కుల ఇసుక ఇవ్వడం లేదని జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: 'ఏడాది పాలనలో అప్పులు తప్ప.. అభివృద్ధి శూన్యం'