కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం, ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామాల్లో హైపో క్లోరైడ్ స్ప్రే చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయనే స్వయంగా గ్రామాల్లో తిరుగుతూ స్ప్రే చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: ఎన్నికల విధులకు హాజరైన 1,673 మంది టీచర్లు మృతి!