సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తోన్న అభ్యంతరకర పోస్టులపై తక్షణం న్యాయ విచారణ చేసి దోషులను శిక్షించాలని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ మాజీ ఛైర్మన్ నవీన్ తదితరులతో కలిసి దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దిశ చట్టానికి కేంద్రం నుంచి అనుమతి రానందున, ప్రస్తుతం దిశ కేసులు.. నమోదు చేయలేమని పోలీసులు చెప్పడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాలు పూర్తి కాకుండానే మహిళలను మభ్యపెట్టేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇలా అయితే దిశ పోలీస్స్టేషన్లలో సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మహిళా నేతలు ప్రశ్నించారు. శాసనసభలో మద్యంపై తాను మాట్లాడిన అనంతరం సామాజిక మాద్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని, దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆరోపించారు.
ఇదీ చూడండి: