మిజోరం రాష్ట్రానికి చెందిన 30 మంది నర్సింగ్ విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో క్రిస్టియన్ మెడికల్ సెంటరులో శిక్షణకు వచ్చి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. సొంత రాష్ట్రానికి వెళ్లడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావటంతో సీఐ సూర్యపార ఆధ్వర్యంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ విద్యార్థులకు పిఠాపురం ప్రభుత్వ వైద్యాధికారి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి త్వరలోనే కన్నా భూ కబ్జా వ్యవహారం బయటపెడతా'