ETV Bharat / state

వరద బాధితులను ఆదుకుంటాం: మంత్రి వేణుగోపాలకృష్ణ - minister venugopal krishna visit in rampachodavaram

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.

minister venugopal krishna
minister venugopal krishna
author img

By

Published : Aug 21, 2020, 10:50 PM IST

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జిల్లా కలెక్టర్​ మురళీధర్​రెడ్డితో కలిసి పర్యటించారు. సహాయక చర్యలతో పాటు పునరావాస కేంద్రాలను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఏజెన్సీలో 80 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్న మంత్రి... వారందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంత్రి పర్యటనలో ఐటీడీఏ అధికారులతో పాటు అడిషనల్​ ఎస్పీ పాల్గొన్నారు.

ఇదీ చదవండి

నెల్లూరులో విషాదం... రైలు కింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.