10 కొత్త ఇంద్ర బస్సులను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్ - అమలాపురంలో 10 కొత్త ఇంద్ర బస్సుల ప్రారంభం
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాక.. సంస్థ లాభాల బాటలో పయనిస్తోందని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి 10 కొత్త ఇంద్ర బస్సులను ఆయన ప్రారంభించారు. అమలాపురం నుంచి హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లడానికి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. త్వరలో విశాఖకు అధునాతన బస్సులు నడుపుతామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జెండా ఊపుతున్న మంత్రి పినేపి
By
Published : Mar 5, 2020, 4:05 PM IST
10 కొత్త ఇంద్ర బస్సులను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్