తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రైతు బజార్ కోసం.. మంత్రి కురసాల కన్నబాబు స్థల పరిశీలన చేశారు. పశువుల సంత ఉండే స్థలంలో.. రైతు బజార్ కోసం స్థలాన్ని పరిశీలించి.. వెంటనే ఆమోదం తెలిపారు. జనావాసాల మధ్య పశువుల సంత ఉండటంతో.. స్థానికులంతా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే వేరే చోటకి మార్చామని తెలిపారు. పశువుల సంత ఉన్న స్థలంలో.. సచివాలయం-1 నిర్మించి, రైతులకు మేలు చేసేలా రైతు బజారు ఏర్పాటు చేశామని చెప్పారు.
రాజపూడిలోని పద్మావతి టైల్స్ ఫ్యాక్టరీ, శ్రీనివాస సిరామిక్స్ ఫ్యాక్టరీల్లో.. తయారవుతున్న పెంకులను పరిశీలించారు. వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 32 టైల్స్ ఫ్యాక్టరీ ఉండేవని.. కాలక్రమేణా వాటి ఉపయోగం లేక మూతపడ్డాయని కార్మికులు మంత్రికి తెలిపారు. ఎంతో పని కల్పించే ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని ఇప్పటికైనా... వీటిమీద మంత్రి చర్యలు తీసుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి:
MP Raghurama: జగన్ ఆస్తుల కేసులపై.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్