జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సినిమాలు వదిలేసినా... నటనను మాత్రం వదల్లేదని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. విశాఖలో పవన్ చేసిన లాంగ్ మార్చ్‌పై విమర్శలు సంధించిన ఆయన.. లేని సమస్యను ఉన్నట్లుగా చూపించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెదేపా హయాంలో ఇసుక అక్రమాలకు పాల్పడిన నాయకులను పక్కన పెట్టుకుని వేదిక మీద నిలబడినప్పుడే... ఇసుక మీద మాట్లాడే నైతిక హక్కును పవన్ కోల్పోయారన్నారు. జగన్‌నే విమర్శించడమే పవన్ పనిగా పెట్టుకున్నారని అన్నారు.
ఇదీ చూడండి: