మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ... పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇరువురు చర్చించారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాం ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కృష్ణారావు కోరారు. స్థానిక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు... మంత్రి వేణుగోపాలకృష్ణను సత్కరించారు.
ఇదీ చదవండి :