తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మెగాపవర్ స్టార్ రాంచరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల చిట్టిబాబు చేతుల మీదుగా కేకును కోశారు. క్తదానం చేసిన 30 మందికి చిరంజీవి సేవాసమితి తరుపున ధ్రువపత్రాలు అందజేశారు.
ఇప్పటివరకు 58 సార్లు రక్తదానం చేసిన రాజోలు తాలూకా చిరంజీవి సేవసమితి అధ్యక్షుడు గుండాబత్తుల తాతజి, 54 సార్లు రక్తదానం చేసిన రుద్ర శ్రీనును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెండెంట్ ప్రభాకర్, గుండుబోగుల పెద్దకాపు, దిరిశాల బాలాజీ, కోళ్ల బాబీ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: