ETV Bharat / state

'ఇళ్లు పూర్తి కాలేదని వైకాపా నేతలు మభ్యపెడుతున్నారు' - మండపేట నేటి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అర్హులకు ఇవ్వాల్సిన ఇళ్లు పూర్తి కాలేదని వైకాపా నేతలు మభ్యపెడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. గొల్లపుంత అపార్ట్​మెంట్స్ ఫేజ్-1కి సంబంధించిన గృహాలను ఆయన పరిశీలించారు.

mandapeta mla vegulla jogeshwararao fire on ycp leaders about apartment houses
తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
author img

By

Published : Mar 7, 2021, 10:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లపుంత అపార్ట్​మెంట్స్ ఫేజ్-1 కి సంబంధించి లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా నిర్మాణాలు పూర్తి కాలేదంటూ వైకాపా నేతలు మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు ఇళ్లు అందిస్తామని తెలిపారు. పట్టణంలో వైకాపా నేతలు అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. తేదెపా, వైకాపా నాయకులు చేసిన నిర్మాణాలపై విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు తెలుస్తాయని జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

ఇదీచదవండి.

'జగన్ ఫేక్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో సమాధానం చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.