ETV Bharat / state

భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య! - Yanam Latest news

భార్య దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఈ ఘటన జరిగింది. యానాంకు చెందిన రాజారావు కువైట్​లో ఉన్న తన భార్యను ఇంటికి రావాలని తరుచూ కోరేవాడు. పరిస్థితులు అనుకూలించక.. భార్య మహాలక్ష్మీ రాలేకపోయింది. పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన రాజారావు.. ఈసారి నిజంగానే ఉరేసుకొని చనిపోయాడు.

Man Suicide for his wife in Yanam
భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్నాడు..!
author img

By

Published : Sep 30, 2020, 4:07 PM IST

Updated : Sep 30, 2020, 4:57 PM IST

తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని ఉదయ్​కృష్ణ వంశీనగర్​లో నివాసం ఉంటున్న పదివేల రాజారావుకు భార్య.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెల్డింగ్ పనులు చేసుకుంటూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని ఆశతో ఏడాదిన్నర కిందట భార్య మహాలక్ష్మిని కువైట్​లో పనికి పంపించాడు.

కొన్నాళ్లకు భార్య లేని లోటు కనిపించింది. పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు. భార్యను తిరిగి వచ్చేయాలని కోరడం మొదలుపెట్టాడు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అతని మాటను ఆమె పట్టించుకోలేదు. ఒకటి రెండుసార్లు ఆత్మహత్య చేసుకుంటున్నాననీ బెదిరించాడు.

ఇంతలో కరోనా కారణంగా లాక్​డౌన్ వచ్చింది. ఇతర దేశాల్లో ఉన్నవారిని స్వస్థలాలకు పంపించేస్తున్నారని.. ఇప్పుడైనా వచ్చేయాలని ఈ మధ్య తరచూ భార్యకు ఫోన్ చేశాడు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని భార్య చెబుతూవచ్చింది. భార్యాపిల్లలు దూరంగా ఉండడంతో ఒంటరితనాన్ని భరించలేక రాత్రి భార్యకు వీడియో కాల్ చేసి.. నీవు వెంటనే బయలుదేరకుంటే ఇలా ఉరేసుకుంటానని ఫ్యానుకు వైరుకట్టి తన మెడకు చుట్టుకుని చూపించాడు.

వెంటనే ఆమె స్థానిక బంధువులకు విషయం తెలపగా.. ఇలా భయపెట్టడం అతనికి మామూలేనని వారు పట్టించుకోలేదు. ఉదయం షాపులో పనికి రాకపోవడంతో.. తోటి పనివారు ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

భావితరాలూ ఈ అప్పులను తీర్చలేరు: యనమల

Last Updated : Sep 30, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.