తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజానగరం మండలం భూపాలపట్నం వద్ద చెరువులో ఓ యుకుడిని తల నరికి గోనె సంచిలో కట్టి పడేసారు. చెరువులో పడేసిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌గా గుర్తించారు.
ఈ నెల 15న తన కుమారుడు అదృశ్యమైనట్టు దుర్గాప్రసాద్ తండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎవరు హతమార్చారనే విషయంపై రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పోస్టుల వివాదం.. తెదేపా నేత దారుణ హత్య