మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ముక్తి కాంత సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలను తలుస్తూ.. పిండ ప్రదానాలు చేశారు. ఆ పరమశివుడికి వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
ఇవీ చూడండి...