తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో సర్పంచి అభ్యర్థులు తమకు ఓటు వేయవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా అధికారులు వారికి గుర్తులు కేటాయించారు. ఇంతలో గ్రామస్థులంతా భేటీ అయ్యి.. ఒక్కరే పోటీలో నిలవాలని తీర్మానించి, కడి అరుణకుమారి పేరును ఖరారు చేశారు. మిగతా ఇద్దరు నాగలక్ష్మి, వెంకటరమణ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. నిబంధనలు ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉండటంతో వారు అరుణకుమారికే మద్దతుగా ప్రచారబాట పట్టారు. పోటీలో ఉన్నప్పటికీ.. తమ గుర్తులకు ఓటు వేయవద్దని కోరుతున్నారు.
ఇదీ చదవండి: