ETV Bharat / state

ఒకప్పుడు కుటీరం... ఇప్పుడదే జీవనాధారం! - farmer

తూరుపు తీరంలో మధుర ఫలానిది ప్రత్యేక స్థానం. అక్కడి మామిడి తాండ్ర ఎంతో సుప్రసిద్ధం. ఒకప్పుడు కుటీర పరిశ్రమగా ప్రారంభమైన తాండ్ర తయారీ... ఇప్పుడు ఎంతోమందికి జీవనాధారమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ లొట్టలేసుకుతినే మామిడి తాండ్ర తయారీ.. అందులోని కష్టనష్టాల గురించి తెలుసుకుందామా...

ఒకప్పుడు కుటీరం... ఇప్పుడదే జీవనాధారం!
author img

By

Published : Jun 2, 2019, 8:33 AM IST

ఒకప్పుడు కుటీరం... ఇప్పుడదే జీవనాధారం!

తూర్పు గోదావరి జిల్లా మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధం. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ప్రత్తిపాడు, గొల్లప్రోలు, కత్తిపూడి, శంకవరం తదితర మండలాల్లో తయారీ యూనిట్లు విస్తృతంగా పెరిగాయి. గతంలో చేతి తయారీతో నడిచే తాండ్ర తయారీ పరిశ్రమల్లో ఇప్పుడు యాంత్రీకరణ పెరిగింది. పెద్ద యూనిట్లలో 200 నుంచి 300 మంది కూలీలు పని చేస్తున్నారు. చిన్న యూనిట్లలో 60 నుంచి 70 మందికి ఉపాధి లభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వేసవిలో మాత్రమే తాండ్ర తయారీ జరుగుతుండగా... మరికొన్ని పరిశ్రమల్లో ఏడాది పొడవునా తయారు చేస్తున్నారు.

గడ్డిలో మగ్గబెట్టి...

మామిడి కాయలను ఎండుగడ్డి వేసి మగ్గబెడతారు. పండిన మామిడి ఫలాలను మరోసారి గ్రేడింగ్ చేస్తారు. తర్వాత వాటిని కోసి జ్యూస్ తీస్తారు. ఆ రసం మరిగించి కొద్దికాలం నిల్వ చేస్తారు. కొంతమంది తయారీదారులు మాత్రం వెంటనే బెల్లం, పంచదార కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు. అనంతరం చాపలు పరిచి వాటిపై మామిడి రసం పోసి అధిక ఉష్ణోగ్రతలో ఎండబెడతారు. అప్పుడు ఆ మామిడి రసం మామిడి తాండ్రగా తయారవుతుంది. గట్టిబడిన మామిడి తాండ్రను ముక్కలుగా కోసి తెలుగు రాష్ట్రాలతోపాటు బీహార్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

తగ్గిన దిగుబడి...

సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో జిల్లాలో ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గిపోయింది. మకరం దెబ్బకు, అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలుల ప్రభావానికి మరికొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. ఈ రెండు సమస్యల దృష్ట్యా మామిడి ఫలాల కొనుగోలు ప్రక్రియ జాప్యమైంది. దీనివల్ల తాండ్ర తయారీ పరిశ్రమల్లో పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో దిగుబడి తగ్గడంతో నూజివీడు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మామిడి కాయల ధరలు భారీగా పెరగడంతో తాండ్ర తయారీకి పెద్దమొత్తంలో ఖర్చవుతోంది. అందుకే ఈసారి తాండ్ర తయారీకి కలెక్టర్ రకం మామిడి కాయలను మాత్రమే వినియోగిస్తున్నారు.

తూర్పు గోదావరిలో తయారయ్యే... రుచికరమైన, శుచికరమైన మామిడి తాండ్ర దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి గడించింది.

ఇదీ చదవండీ: ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు... ఇక్కడ ప్రవేశం లేదు!

Intro:ap_rjy_61_01_girijanulu_no water_americans_avb_pkg_c10

Body:ap_rjy_61_01_girijanulu_no water_americans_avb_pkg_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.