తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని... బయటికి రావొద్దని పోలీసులు చెబుుతున్నా ప్రజలు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. ఇష్టానుసారంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో తిరిగి మైకులు, దండోరా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్తిపాడులోని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే కార్మికులకు సెలవులు ఇవ్వకపోవడంపైనా పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు అవగాహన
రావులపాలెంలో పోలీసులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా మాస్క్‌లు అందించారు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటివద్ద ఉండాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. కొత్తపేట ప్రజలంతా పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ కావాలని సీతారామచంద్రస్వామి ఆలయంలో అహో రాత్ర వేదపారాయణ కార్యక్రమం నిర్వహించారు.
రహదారులు మూసివేత
పి.గన్నవరం నియోజవర్గంలో పోలీసులు రహదారులను మూసివేశారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు విధిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించి బయట తిరిగే వారిపై లాఠీలు ఝళిపిస్తున్నారు.
అనపర్తిలో 13 మందిపై కేసు నమోదు
అనపర్తిలో లాక్డౌన్ రెండో రోజు కొనసాగింది. నిత్యావసర దుకాణాల మినహా మిగిలిన షాపులను పోలీసులు మూసివేయించారు. ఆసుపత్రులకు వెళ్లే రోగులను మినహా అందరిని ఇంటికి పంపారు. వాహనాలపై తిరుగుతున్న 13మందిపై కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన దాడిశెట్టి
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తుని ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఐసోలేషన్ వార్డులు, సంబంధిత విషయాలు తెలుసుకుని వైద్యులతో చర్చించారు. కరోనా వ్యాప్తి చెందే పరిస్థితుల నేపథ్యంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయాన్ని పోలీసులు మూసివేశారు.
ఇవీ చదవండి