ETV Bharat / state

యానాంలో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు - latest Puducherry leberation day news in telugu

ఏటా పుదుచ్చేరిలో నిర్వహించే విమోచన దినోత్సవాన్ని... యానాం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... గౌరవ వందనం స్వీకరించారు.

leberation day Celebrations at yaanam
author img

By

Published : Nov 2, 2019, 12:39 AM IST

యానాంలో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

దేశానికి బ్రిటిషు వారి నుంచి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా... పుదుచ్చేరి మాత్రం 1954 నవంబర్ 1న పూర్తిస్థాయిలో భారతదేశంలో విలీనమైంది. అప్పటి నుంచి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది. ఏటా పుదుచ్చేరి విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు. యానాం బాలయోగి క్రీడా ప్రాంగణంలో... డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

Intro:ap_rjy_36_01_leberation day_av_ap10019. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:కేంద్రపాలిత యానంలో పుదుచ్చేరి విమోచన దినోత్సవం

Conclusion:భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వారి నుండి 1947 ఆగస్టు 15 వచ్చినా భారతదేశం లోనే ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి మాత్రం 1954 నవంబర్ 1వ తేదీన మాత్రమే పూర్తిస్థాయిలో భారతదేశంలో విలీనమైంది అప్పటివరకు పుదుచ్చేరిలోని నాలుగు ప్రాంతాలు అయిన తమిళనాడులోని పుదుచ్చేరి.. కారెకాల్...కేరళలోని మాహే...ఆంధ్రప్రదేశ్ లోని యానాంలు ఫ్రెంచ్ వారి పాలనలోనే ఉన్నాయి.. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఫ్రెంచ్ ప్రాంతాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నవంబర్ 1న పుదుచ్చేరి పూర్తిస్థాయిలో భారతదేశంలో విలీనమైంది.. అప్పటినుండి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది ..ఈ సందర్భంగా ప్రతి ఏటా పుదుచ్చేరి విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటార.. ఇందులో భాగంగా కేంద్ర పాలిత యానం బాలయోగి క్రీడా ప్రాంగణంలో యానం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి కపోతాలు త్రివర్ణ బుడగలను గాలిలోకి వదిలారు.. సాంస్కృతిక కార్యక్రమాలలో చెట్ల పెంపకం పై విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.