విశాఖ జిల్లా అనకాపల్లిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి దంపతులు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కి అధికారులు ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావుకి పలువురు అధికారులు తెదేపా నాయకులు కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లోని మొక్కలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికాయి. మొక్కల్ని అన్నింటినీ ఒకేచోట 2020 సంవత్సరం ఆకృతిలో అమర్చారు. కడియంలోని పల్లా వెంకన్న నర్సరీలో ఏడు రోజులు శ్రమించి లక్ష మొక్కలను ఒకే చోటకు చేర్చి... 2020 ఆకృతిని ఏర్పాటు చేయడంతో పాటు... పూలతో కూడా ఇదేవిధంగా రూపొందించారు. నర్సరీకి వచ్చే సందర్శకులను ఈ ఆకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి...