ప్రతీసారి ఇదే పరిస్థితి
వర్షాకాలం వస్తే చాలు.. అందరికీ నావ తప్ప వేరే మార్గం లేదు. పిల్లలు బడికి, పెద్దలు పనులకు వేళ్లాలన్నా నది దాటాల్సిందే. ఒక వంతెన కావాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు మూడు రోజులుగా వరద పోటు ఎత్తడంతో పోలవరం ఎగువ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం మండలం కొత్తూరు కాజ్వే పైకి వరద నీరు మూడు అడుగుల మేర చేరుకోవటంతో ట్యూబ్‌లకు తడికలు కట్టి ప్రజలను దాట వేస్తున్నారు.
ఇది చూడండి: "మా దేశానికి రండి"... జగన్‌కు జపాన్ ప్రతినిధుల ఆహ్వానం