తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని దమ్ములపేటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు గత ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించింది. దాన్ని చదును చేస్తున్న క్రమంలో.. స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టాలు తమకిచ్చి ఆర్టీసీకి స్థలం కేటాయించారని స్థానికులు ఆరోపించారు.
బాధితులకు తెదేపా కాకినాడ సిటీ మాజీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ములపేటలో 350 పట్టాలు అందాయని, ఇళ్లు కూడా మంజూరయ్యాయని తెలిపారు. పేదలకు ఇచ్చిన స్థలాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. పనులను అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని.. బందోబస్తు పెట్టి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: చదువుల నిలయం.. సమస్యల తాండవం..!