ఎగువ నుంచి వరద తగ్గినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని అనేక గ్రామాలకు.. వరద బాధలు తప్పటం లేదు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సముద్రంలోకి విడిచిపెట్టారు. నిన్నటి కంటే వరద ప్రవాహం తగ్గినప్పటికీ కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీ పాయల్లో.. వరద జోరు కొనసాగుతోంది. ఈ నదీ పాయల మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలు, రైతులు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు . చాకలిపాలెం సమీపంలో కాజ్‌వే నాలుగు రోజులుగా నీటిలోనే ఉంది.
ఇదీ చదవండీ.. సరుగుడు మొక్కల పెంపకంపై కుదరని సయోధ్య.. కొనసాగుతున్న 144 సెక్షన్