తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో కోడి పందేల జోరు రెండోరోజు రెట్టింపు ఉత్సాహంతో సాగింది. మొదటిరోజు పోలీసుల అడ్డంకులతో కొన్ని ప్రాంతాల్లో నిర్వాహకులు బరులు నిలిపివేశారు.
సాయంత్రానికి పోలీసులు ఏ ప్రాంతంలోనూ దాడులు చేయకపోయేసరికి.. మునుపెన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలోనూ పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గుండాటలను సైతం నిర్వహించారు.
ఇదీ చదవండి:
ఉదయం నుంచే కోడి పందేలు షురూ.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు