తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కేంద్రపాలిత యానంలో కార్తికమాసం నాలుగవ సోమవారం కావటంతో గౌతమి గోదావరి నది తీరం సందడిగా మారింది. తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి వదిలారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే గోదావరిలో స్నానానికి పోలీసులు అనుమతించారు. ఆత్రేయ నది తీరాన కొలువై ఉన్న రాజరాజేశ్వరీ సమేత ఆలయంలో మూలవిరాట్టుకు వేద మంత్రోచ్చారణలు చేస్తూ అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది.
ఇదీ చదవండి: