తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కర్రివానిరేపు పంచాయతీ పరిధిలో రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలను అనుకొని కిలోమీటర్ల పొడవునా కాపుతో ఉన్న కొబ్బరి చెట్లను.. వాటి యజమానులు నరికివేస్తున్నారు. ఇటీవల దింపు కార్మికులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం... ఈదురు గాలులు, వర్షాల కారణంగా తీగలపై ఆకులు, చెట్లుపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సంఘటనలు జరిగాయి. 15 సంవత్సరాల పైబడిన చెట్లు ఎత్తుగా ఎదిగి గాలిలో ఊగుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోని అంతా ఆందోళన చెందారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. వీరికి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సహకరించారు.
ఇదీ చదవండి: