ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతుల నిర్వహణకు కాకినాడ జేఎన్​టీయూ నిర్ణయం

author img

By

Published : Mar 27, 2021, 10:38 PM IST

ఈనెల 30 నుంచి ఆన్​లైన్​ ద్వారా తరగతులు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్​టీయూ కళాశాల ప్రిన్సిపల్ ఆదేశించారు. అంతర్జాల విద్యాబోధనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హెచ్​వోడీలకు సూచించారు. విద్యార్థులు, సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

jntu kakinada online classes, jntuk decided to conduct online classes
కాకినాడ జేఎన్​టీయూలో ఆన్​లైన్​ తరగతులు, ఆన్​లైన్​లో తరగతుల నిర్వహణకు జేఎన్​టీయూ నిర్ణయం

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జేఎన్​టీయూలో విద్యార్థులు, సిబ్బందికి కరోనా సోకడంతో అధికారులు చర్యలకు దిగారు. ఈనెల 30 నుంచి అన్ని తరగతుల పాఠ్యాంశాలను ఆన్​లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జేఎన్​టీయూ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ ఉత్తర్వులు విడుదల చేశారు.

విద్యార్థులకు ఆన్​లైన్ ద్వారా పాఠ్యాంశాల బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కళాశాలలోని అన్ని విభాగాలకు చెందిన హెచ్​వోడీలకు ప్రిన్సిపల్ సూచించారు. బీటెక్ ఆఖరి, ద్వితీయ ఏడాది విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం తరగగతి గదుల్లోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

స్థానికుడి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం..రోడ్డుకు మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.