నవరత్నాలకోసం నిధులు కేటాయించిన విధంగానే..రైతు సంక్షేమం కోసం నిధులు సమకూర్చాలని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబరు నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా మెట్టప్రాంత రైతులకు పెట్టుబడి డబ్బులు కూడా రాలేదన్నారు. జగ్గంపేట 1,500 , గండేపల్లి 750, కిర్లంపూడి 1,330 , గోకవరం మండలాల్లో 840 ఎకరాల చొప్పున పంట నష్టం వాటిల్లిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.
ఇదీచదవండి