వరదల నియంత్రణ, బాధితుల్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా కాకినాడ పార్లమెంట్ కో- ఆర్డినేటర్ జ్యోతుల నవీన్ విమర్శించారు. వరద బాధితుల్ని పరామర్శించే తీరిక కూడా సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో వరి చేలతో సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తక్షణం రైతుల్ని ఆదుకోవాలని జ్యోతుల నవీన్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'