సోమవారం కిడ్నాప్‌కు గురైన జషిత్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు వద్ద జషిత్ ఆచూకీ లభ్యమైంది. బాలుడు జషిత్‌ను అగంతుకులు వదిలివెళ్లారు. చిన్నారి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. తెల్లవారుజామున బాలుడిని వదిలివెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. జషిత్ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
సంబంధిత కథనం