రాష్ట్రంలో మంత్రుల వ్యాఖ్యలు, వారి తీరు అభ్యంతరకరంగా ఉందని జనసేన నాయకులు విమర్శించారు. అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి పాతసినిమాల్లో ముఠాల్లాగా ఉందని జనసేన నేత కందుల దుర్గేశ్ ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేల చొప్పున పరిహారం అందించాలని పవన్ డిమాండ్ చేస్తే..ఆయనపై మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్నదాతలకు పరిహారం అందించకుంటే శాసనసభ ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి