తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం పూర్వపు ఈవో చంద్రశేఖర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు… రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ అధికారి భ్రమరాంభ విచారణ చేపట్టారు. చంద్రశేఖర్‌పై దేవస్థానం మాజీఛైర్మన్ కరపా అప్పారావు, ప్రస్తుత ఛైర్మన్ ఉమారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని ఆమె తెలిపారు. ప్రసాదం విక్రయాలు, సిబ్బందికి అడ్వాన్స్‌ల చెల్లింపు, ఉద్యోగుల జీతాలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని విచారణాధికారిణి తెలిపారు.
ఇదీ చదవండి: తుని పురపాలక శాఖ కార్యాలయంలో ముగ్గురికి కరోనా