ETV Bharat / state

Enquiry: అక్రమ మద్యం కేసులో ఆ ఇద్దరి పాత్ర..ఏం చేశారంటే..! - ఎస్​ఐ, హెడ్​కానిస్టేబుల్​పై విచారణ

అక్రమ మద్యం కేసులో లంచం
అక్రమ మద్యం కేసులో లంచం
author img

By

Published : Sep 7, 2021, 6:55 PM IST

Updated : Sep 7, 2021, 8:13 PM IST

18:52 September 07

గొల్లపాలెం ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌పై విచారణ

అక్రమ మద్యం (Illegal liquor) పట్టివేత కేసులో రూ. 20 వేలు లంచం (Bribe)  తీసుకొని నిందితులను వదిలేశారన్న అభియోగంపై (Allegation) తూర్పుగోదావరి జిల్లా గొల్లపాలెం ఎస్​ఐ, హెడ్ కానిస్టేబుల్​పై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ రవీంద్రబాబు (SP Ravindra Babu) ఆదేశాల మేరకు ఎస్​ఐ (SI) పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ (Head Constable) భీమ శంకర్​లను స్పెషల్ బ్రాంచ్ (Special branch) అధికారులు విచారించారు.  

ఏం జరిగిందంటే..

ఈ నెల 3న  కాజులూరుకు చెందిన కమిడి వీరేంద్ర, భాను ప్రకాశ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యం విక్రయిస్తున్నారని గొల్లపాలెం పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. పోలీసు స్టేషన్​లో (Police Station) విచారణ అనంతరం  నిందితుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకొని వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కాజులూరుకు చెందిన వంగా శ్రీనివాస్, పెంకే రవితేజ,  కనుమూరి సతీశ్​లు ఈ నెల 6న స్పందన (Spandana) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గొల్లపాలెం  పోలీసు స్టేషన్ సెటిల్మెంట్​లకు (settlements) అడ్డాగా మారిందని ఎస్ఐ పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమ శంకర్​లపై చర్యలు (Action) తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు (Written Complaint) చేశారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ రవీంద్ర బాబు..గొల్లపాలెం ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్​లపై విచారణ చేపట్టాలని ఎస్బీ సీఐ (SB CI) సత్యనారాయణను ఆదేశించారు. ఈ మేరకు ఎస్బీ పోలీసులు విచారణ (Enquiry) చేపట్టారు. విచారణ అనంతరం నివేదికను (Report) ఎస్పీకి అందజేస్తామని ఎస్బీ అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి

Fake Challans: నకిలీ చలాన్ల వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Last Updated : Sep 7, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.