తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో మంగళవారం 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెదపూడి మండలంలో 28 కేసులు నమోదుకాగా ...బిక్కవోలు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఒక్కొక్కటి వెలుగు చూశాయి. గొల్లలమామిడాల గ్రామంలో తొలి పాజిటివ్ మరణం నమోదైంది. బసివిరెడ్డిపేటలో మంగళవారం రెండు పాజిటివ్ కేసులు నమోదవ్వగా వీరిలో 11 ఏళ్ల బాలిక, 70 ఏళ్ల వృద్దురాలు ఉన్నారు. అదేవిధంగా బిక్కవోలు గ్రామంలోని దేవుడి మాన్యంలో అయిదేళ్ల బాలుడిలో వైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. బాలుడి తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించారు. మంగళవారం నాటికి పెదపూడి మండలంలోని జి.మామిడాడకు అనుబంధంగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కి చేరింది.
జిల్లాలో విజృంభిస్తున్న కరోనా - corona latest updates east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో వెల్లడించిన ఫలితాల్లో ఏకంగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
![జిల్లాలో విజృంభిస్తున్న కరోనా Increasing corona cases in East Godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7367450-1091-7367450-1590578637405.jpg?imwidth=3840)
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో మంగళవారం 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెదపూడి మండలంలో 28 కేసులు నమోదుకాగా ...బిక్కవోలు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఒక్కొక్కటి వెలుగు చూశాయి. గొల్లలమామిడాల గ్రామంలో తొలి పాజిటివ్ మరణం నమోదైంది. బసివిరెడ్డిపేటలో మంగళవారం రెండు పాజిటివ్ కేసులు నమోదవ్వగా వీరిలో 11 ఏళ్ల బాలిక, 70 ఏళ్ల వృద్దురాలు ఉన్నారు. అదేవిధంగా బిక్కవోలు గ్రామంలోని దేవుడి మాన్యంలో అయిదేళ్ల బాలుడిలో వైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. బాలుడి తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించారు. మంగళవారం నాటికి పెదపూడి మండలంలోని జి.మామిడాడకు అనుబంధంగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కి చేరింది.
ఇదీచదవండి:కొబ్బరి రైతులకు.. తీపి కబురు