తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి నది పాయపై రూ 49. 50 కోట్ల నిధులతో రెండు వరుసల వంతెన నిర్మాణానికి ఫిబ్రవరిలో టెండర్లు పిలవనున్నట్లు పంచాయతీరాజ్ డీఈఈ రాంబాబు తెలిపారు. పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక వద్ద చేపట్టే ఈ నిర్మాణం పూర్తైతే గోదావరి మధ్యలో గల ఊడిమూడి లంక, బూరుగు లంక, జీ .పెదపూడి లంక, అరిగెలవారిపేట లంక గ్రామాల ప్రజలు కష్టాలు తీరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
'వంతెన నిర్మాణానికి 9ఏళ్లు కింద పీఎంజీఎస్‌వై నిధులు రూ.19 .20 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులు సరిపోకపోవడం వల్ల 2018లో అప్పటి ప్రభుత్వం రూ. 49.50 కోట్ల మంజూరు చేసింది. కానీ అప్పుడు టెండర్ దశకు వెళ్లలేదు. ఇప్పుడు టెండర్ దశకు చేరుకుంది. టెండర్లు ఖరారైతే ఈ ఏడాది వరదల సీజన్‌లోపు పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది' అని డీఈఈ రాంబాబు వివరించారు.
ఇదీ చూడండి: వింతవ్యాధి బాధితులను పరామర్శించిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్