తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజయదశమిని పురస్కరించుకుని వివిధ దసరా ఉత్సవ కమిటీలు ఆయుధ పూజలు చేశాయి. ఈ సందర్భంగా చెడీ తాళింఖనా (కర్ర సాము, కత్తి సాము....సాంప్రదాయ నృత్యాల సమూహం) వంటి ప్రదర్శనలు అమ్మవారి ఎదుట ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి రాత్రి.. ఆయా వీధులలో మాత్రమే అధికారులు నిర్దేశించిన సమయం ప్రకారం ఈ ప్రదర్శనలు చేస్తారు.
ఇదీ చదవండీ...సైకత దుర్గమ్మను సృష్టించిన శ్రీనివాస్