ETV Bharat / state

సుద్ద మట్టిని కొల్లగొట్టేస్తున్న అక్రమార్కులు - jaggampeta latest news

తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో.. సుద్ద మట్టి అక్రమ తవ్వకాలు అడ్డులేకుండా సాగిపోతున్నాయి. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో రాత్రీపగలు తేడా లేకుండా సుద్దమట్టిని కొల్లగొట్టేస్తున్నారు. రాజకీయ దన్నుతోనే దందా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Illegals looting chalk clay
సుద్ద మట్టిని కొల్లగొట్టేస్తున్న అక్రమార్కులు
author img

By

Published : Mar 21, 2021, 3:35 PM IST

సుద్ద మట్టి అక్రమ తవ్వకాలు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని ప్రభుత్వ పోరంబోకు భూములపై అక్రమార్కుల కన్నుపడింది. అక్కడి సుద్ద మట్టిని విచ్ఛలవిడిగా తవ్వేస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడం వల్ల వంద అడుగులకు పైగా గోతులు ఏర్పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితుడైన ఓ వ్యాపారి అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జగ్గయ్యపేట మండలం రాయవరంలోని.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సమీపంలోని 107, 109 సర్వే నెంబర్లలో ఏడెకరాల వరకు ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో సుద్ద నిల్వలు మెండుగా ఉన్నాయి. కొందరు బడాబాబుల కన్నుపడటంతో ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలకు తెరలేచింది. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి... రాత్రి వేళల్లోనూ విద్యుత్‌ వెలుగులతో పెద్ద ఎత్తున సుద్దను తరలిస్తున్నారు. ఇటీవల సుద్దను తరలిస్తున్న వాహనాలను స్థానికులు అడ్డుకోగా.... ఓ నాయకుడి పేరు చెప్పి బెదిరించారు. అధికారులు చేరుకునేలోపు వాహనాలను తరలించారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. సుద్ద మట్టి లోడులతో వెళ్తున్న భారీ వాహనాల ధాటికి... పక్కనే ఉన్న పురుషోత్తపట్నం ప్రాజెక్టు పైపులైన్లు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. గుర్రంపాలెం-మర్రిపాక-రాయవరం రహదారి పక్కనే పెద్ద గోతులు ఏర్పడటంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

ఇదీ చదవండి:

ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాల అడ్డగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.