తూర్పు గోదావరి జిల్లా బోటు ప్రమాదంలో గల్లంతైన తమ కుటుంబసభ్యుల ఆచూకీ తెలపాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి రాజమహేంద్రవరం ఆసుపత్రి ముందు ఆందోళన చేశాడు. నలుగురు గల్లంతయ్యారని అందులో ఒకరి మృతదేహం మాత్రమే లభించిందని చెప్పాడు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గాజు సీసాతో తలపై గాయపరచుకున్నాడు. మార్చురీలో ఉన్న వేరే కుటుంబానికి చెందిన మృతదేహాన్ని సరిగా నిల్వ చేసే ప్రక్రియ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు ఈ మృతదేహం సమాచారం అందించలేదని... ఎవరికీ మానవత్వం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
తన వాళ్ల ఆచూకీ కోసం.. హైదరాబాద్ వాసి ఆవేదన
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఎదుట హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఆందోళన చేశాడు. బోటు ప్రమాదంలో తన కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతవగా.. ఇప్పటివరకూ ఒకరిని మాత్రమే వెలికితీశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగతా వారి ఆచూకీ తెలపాలంటూ గాజు సీసాతో తలపై గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తూర్పు గోదావరి జిల్లా బోటు ప్రమాదంలో గల్లంతైన తమ కుటుంబసభ్యుల ఆచూకీ తెలపాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి రాజమహేంద్రవరం ఆసుపత్రి ముందు ఆందోళన చేశాడు. నలుగురు గల్లంతయ్యారని అందులో ఒకరి మృతదేహం మాత్రమే లభించిందని చెప్పాడు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గాజు సీసాతో తలపై గాయపరచుకున్నాడు. మార్చురీలో ఉన్న వేరే కుటుంబానికి చెందిన మృతదేహాన్ని సరిగా నిల్వ చేసే ప్రక్రియ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు ఈ మృతదేహం సమాచారం అందించలేదని... ఎవరికీ మానవత్వం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
Body:నాయుడుపేట
Conclusion: