తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు వద్దంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలవరం కాలువ దగ్గరలో కేటాయించిన స్థలాలు వద్దని 6 నెలలుగా చెబుతున్నా.. బలవంతంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి జనసేన నాయకులు పాఠంశెట్టి సూర్యచంద్ర మద్దతు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'రంపచోడవరం ఆసుపత్రిలో.. రోగులకు చాలీచాలని భోజనం'